SVT: శాన్‌డియాగో శివ విష్ణు దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు షురూ

శాన్ డియాగోలోని శివ విష్ణు దేవాలయం (SVT) తన 25వ వార్షికోత్సవాన్ని (25th Anniversary) జరుపుకునేందు కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం నుండి అక్టోబర్ 12వ తేదీ ఆదివారం వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఎస్వీటీ (SVT) తెలిపింది. పోవాయ్‌లోని 16315 పొమెరాడో రోడ్‌లో ఉన్న ఈ (SVT) దేవాలయం పాతికేళ్లుగా వైదిక సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక సేవకు ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో శివుడు, విష్ణుమూర్తి, వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశీయ, స్థానిక కళాకారులు ఈ (25th Anniversary) వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ ప్రదర్శనలతో అందర్నీ అలరించనున్నారు. ఈ వేడుకల చివర్లో మహా ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.
ఈ సందర్భంగా తమ భవిష్యత్ కార్యక్రమాలకు, ఈ వార్షికోత్సవ వేడుకకు మద్దతు ఇవ్వాలని దేవాలయం (SVT) తమ భక్తులు, కమ్యూనిటీ సభ్యులను కోరింది. ఈ వేడుకల్లో 108 కలశాలను మోసే గౌరవం 51 దాత కుటుంబాలకు అందనుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి $1,116 చెల్లించే సిల్వర్ స్పాన్సర్ (Silver Sponsor) పేరును ఒక సంకల్ప పూజలో చేరుస్తారు. అన్నదానం లేదా పూల స్పాన్సర్‌షిప్ వంటి ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయని ఆలయ (SVT) నిర్వాహకులు వెల్లడించారు. వీటితోపాటు అందించే సాధారణ విరాళాలను కూడా దేవాలయం రాబోయే 25 సంవత్సరాల సేవ, అవుట్ రీచ్ మిషన్‌ల కోసం ఉపయోగిస్తారని పేర్కొన్నారు.