Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కనక దుర్గమ్మ (Kanaka Durga) ఆలయంలో ఈ దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మను సర్వస్వతీ రూపంలో దర్శించుకుని, ప్రభుత్వ తరఫున ప్రత్యేక పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో తాను మొదటిసారి ముఖ్య మంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి ఆలయ నిర్వహణలో అనేక మార్పులు చేపట్టామని తెలిపారు. అప్పటి ఇరుగ్గా ఉన్న ఆలయాన్ని విస్తరించామని, ప్రస్తుత విస్తరణలు కూడా ఆ సమయంలోనే ప్రారంభించబడినదని వివరించారు. దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కింద ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా, కొత్త అన్నప్రసాద భవనం ఆరు నెలల్లో పూర్తవుతుందని, లడ్డూ ప్రసాద తయారీకి తిరుమల తరహాలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గత పాలకులపై విమర్శలు కూడా చేసారు. వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) అనే ఒక మాజీ మంత్రి, వ్యాపార దృష్టితోనే ఆలయ నిర్వహణలో జోరుగా ఉన్నారని, సాంప్రదాయ విధానాలను పక్కన పెట్టి అమ్మవారి సన్నిధిలో కూడా వ్యాపార వృత్తిని కొనసాగించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి వెండి సింహాలను అమ్ముకున్నారు. అంతేకాదు చెప్పుల స్టాండ్ల టెండర్లు కూడా వ్యాపారం కోసం ఉపయోగించినారని పేర్కొన్నారు. వీరి ఆధ్వర్యంలో వల్ల సాధారణ భక్తులు ఆలయంలో సౌకర్యంగా దర్శనం చేసుకోలేకపోయారని చెప్పారు. చంద్రబాబు ఈ అన్యాయాలకు కారణమైన వ్యక్తులు దుర్గమ్మ స్వయంగా ఆలయం నుంచి తరిమికొట్టారని వ్యాఖ్యానించారు.
కూటమి తిరిగి ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నింపబడ్డాయి, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. గత 15 నెలలుగా రాష్ట్రంలో సుపరిపాలనతో పనులు సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సౌకర్యాలు అందుతాయని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలను చర్చించడం ఇష్టం లేదని, అయినప్పటికీ తపనిసరి పరిస్థితిలో ప్రజల సమస్యల గురించి, దుర్మార్గుల చర్యల గురించి ప్రస్తావించవలసి వచ్చిందని చెప్పారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం, ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం సమన్వయం చేసుకుంటూ, ప్రజల భక్తి , సౌకర్యం దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.