జూలైలో ఏపీకి ప్రధాని మోడీ రాక
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జూలైలో రాష్ట్రానికి రానున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు తెలియజేశారు. జులై 15, 16వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖపట్ణంలో జరుగనున్నాయని అన్నారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు 13 బీజేపీ ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు 350 డెలిగేట్లు పాల్గొంటారని వెల్లడించారు.
