ఏపీ రాజధాని మరో హైదరాబాద్‌లా మారొద్దు
సరైన ప్రణాళిక లేకుండా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. దీంతో ఈ నగరానికి కళ తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని మరో హైదరాబాద్‌గా మారకూడదు. ఖచ్చితమైన ముందస్తు ప్రణాళికలతో నిర్మాణాలు సాగాలి. ఆక్రమ నిర్మాణాలకు తావియ్యకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆదర్శ రాజధాని నగరాన్ని నిర్మించి భవిష్యత్తు తరాలకు చక్కటి వాతావరణం కల్పించాలి అని హైకోర్టు సృష్టం చేసింది. ఏపీసీఆర్డీఏ పరిధిలో ఆక్రమ నిర్మాణాలపై రాజీ పడొద్దని అధికారులకు తేల్చి చెప్పింది. నూతన రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అదేస్థాయిలో నిర్మాణాలు ఉండాలని పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై వేసవి సెలవుల తర్వాత రోజువారీ విచారణ చేస్తామని సృష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు.
