కార్మిక వర్గానికి మే డే శుభాకాంక్షలు : లోకేశ్
మే డే సందర్భంగా కార్మిక వర్గానికి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని సృష్టం చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అసంఘటిత కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చంద్రన్న బీమా తీసుకోచ్చామని గుర్తు చేశారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసేవారికి ఉపేక్షించమని హెచ్చరించారు. శ్రమకు తగ్గ ఫలితం, కార్మికుల హక్కులు కాపాడటంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
