త్వరలోనే జీఏడీకి అప్పగిస్తాం : మంత్రి నారాయణ
నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే (MLA), ఎమ్మెల్సీ (MLC) భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాజధాని అమరావతి (Amaravati)లో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. నివాస సముదాయాల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇంటీరియల్తో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. గ్రూప్-1, గ్రూప్-2 అధికారుల టవర్ల పనులు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులపై పక్క రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారన్నారు. 34,525 ఎకరాలకు సంబంధించి ప్లాట్లు రైతులకు ఇచ్చామని, 674 మంది రైతులకు మాత్రమే న్యాయాపరమైన చిక్కుల వల్ల ప్లాట్ల పంపిణీ ఆగిపోయిందన్నారు. కావాలని కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూములు ఇచ్చాం. ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని ప్రచారం చేసే వాళ్లు నిజాలు తెలుసుకోవాలని అన్నారు.
ఇవి కూడా చదవండి
