Nara Lokesh: అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటు లేదు : మంత్రి లోకేశ్
విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారని, వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్ (Bangalore Palace) లో సేదతీరుతూ దొంగ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ(Kakinada) జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాం. వదంతులు నమ్మొద్దు. ఇది ప్రజల ప్రభుత్వం. అత్యవసర సాయానికి టోల్‌ప్రీ నంబర్ 18004250101 ఏర్పాటు చేశాం అని లోకేశ్ పేర్కొన్నారు.







