విశాఖపట్నంలో గ్లోబల్ టెక్ సమ్మిట్
త్వరలోనే విశాఖలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్ట్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
