Cyclone: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసరాలు
మొంథా తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారుల (Fishermen) కు వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కందిపప్పు కిలో, నూనె ఒక లీటర్, ఉల్లిపాయలు కిలో, బంగాళాదుంపలు కిలో, చక్కెర కిలో పంపిణీకి ఆదేశాలిచ్చారు. బియ్యం (Rice), కందిపప్పు, నూనె (Oil), చక్కెర(Sugar) సరఫరా చర్యలు వెంటనే ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఉల్లిపాయలు, బంగాదుంపలు, ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు.







