అసెంబ్లీ నిర్మాణం అద్భుతం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో 192 రోజుల్లోనే అసెంబ్లీని అద్భుతంగా నిర్మించారని విదేశీ భద్రత దళాల బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడింది. అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయ భవనాలను పలు దేశాల భద్రతా దళాల బృందం సందర్శించింది. ఈ బృందంలో అప్ఘానిస్థాన్, టాన్జానియా, బంగ్లాదేశ్, జపాన్‌తోపాటు మన దేశ ప్రతినిధులు కూడా ఉన్నారు.
