ఏపీ చరిత్రలో మరిచిపోలేని రోజు : సీఎం చంద్రబాబు
ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) వ్యాఖ్యానించారు. తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ (Google AI Data Center) కు సీఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. విశాఖకు గూగుల్ (Google) రాక ఏపీకే గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు. విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్ టెల్ (Airtel) రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు.
60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం (Polavaram)ప్రారంభిస్తామని పేర్కొన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2028 చివరినాటికి ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని, మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లి కాబోతుందని తెలిపారు. టెక్నాలజీలో దేశానికే గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉందని వెల్లడించారు. పెట్టుబడిదారులే ఏపీకి భాగస్వాములని చెప్పారు. ఒప్పందాలే కాదని, గ్రౌండింగ్ కూడా తమదే బాధ్యత అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
