దేవినేని నెహ్రూ భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి
గుండెపోటుతో మృతిచెందిన తెలుగుదేశం పార్టీ నేత దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని విజయవాడలోని గుణదలలోగల ఆయన నివాసంలో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేవినేని తనయుడు అవినాశ్‌తో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆయనకు ధైర్యం చెప్పారు.
