దేవినేని నెహ్రూ మృతికి చంద్రబాబు సంతాపం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నెహ్రూ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు. నెహ్రు లాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.
