తిరుమల శ్రీవారికి హైదరాబాద్ వ్యాపారవేత్త భారీ విరాళం
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Varma Steels Private Limited) మేనేజింగ్ డైరెక్టర్ వర్మ స్వామివారిపై తన భక్తిని చాటుకున్నారు. టీటీడీ (TTD) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 1,01,01,116 విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి (Venkayya Chowdary)కి ఈ భారీ మొత్తానికి సంబంధించిన డీడీ (DD)ని ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాతను ప్రత్యేకంగా అభినందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
