ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంకండి పిలుపునిచ్చిన బాబు
రాజకీయ విశ్లేషకులు వివిధ పార్టీల నేతలు ఊహిస్తున్నదే జరగబోతోందా… ? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 2019 వరకు ఆగకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లనుందా? అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. కీలక నేతల వ్యాఖ్యలూ అదే దిశగా ఉంటున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
