ఇండియన్ ఐడల్ విజేతకు సీఎం చంద్రబాబు సత్కారం
జాతీయస్థాయి పాటల పోటీలో ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతా మార్మోగేలా ఘన విజయం సాధించిన ఇండియన్ ఐడల్ రేవంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. రేవంత్‌ను ముఖ్యమంత్రి సన్మానించారు. ఆయనకు ఎలాంటి ప్రోత్సాహం అందించాలన్న అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్‌ను ఆదేశించారు.
