YS Jagan: వైఎస్ జగన్‌కు సీబీఐ షాక్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) విదేశీ పర్యటనపై కోర్టును సీబీఐ ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్ (Cell number) కు బదులు, మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సీబీఐ (CBI) స్పష్టం చేసింది. ఆయన బెయిల్ (Bail) షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్‌పై సీబీఐ కోర్టు ఈ రోజు అంటే, గురువారం విచారణ చేపట్టనుంది.