K-Ramp Review: ఈ దీపావళి కి ఫన్నీ ఎంటర్ టైన్ మెంట్ ‘కే – ర్యాంప్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, కామ్నా జెఠ్మలానీ తదితరులు
సంగీతం : చేతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫి: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఫైట్స్: పృథ్వీ, కో ప్రొడ్యూసర్: బాలాజీ గుట్ట
నిర్మాతలు: రాజేష్ దండా, శివ బొమ్మకు
రచన, దర్శకత్వం: జైన్స్ నాని
విడుదల తేది :18.10.2025
నిడివి : 2 ఘంటల 20 నిముషాలు
Kiran Abbavaram’s Latest Movie K-Ramp Telugu Review: ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్రం k – ర్యాంప్ కూడా ఒకటి. తన సినిమాలను ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు సాధ్యమైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన లేటెస్ట్ మూవీ “K-ర్యాంప్”పై కూడా ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. యువ హీరో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
K-Ramp Story: పెద్ద బిజినెస్ మెన్ అయినటువంటి కృష్ణ (సాయికుమార్)Sai Kumar రిచ్ బిజినెస్ మ్యాన్ కుమారుడు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే తల్లిని కోల్పోవడంతో గారాబంగా పెంచుతాడు కృష్ణ, దాంతో కుమార్ అబ్బవరం అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన చీప్ అలవాట్లతో కాలక్షేపం చేస్తుంటాడు. చదువు, సంధ్య లేకుండా చిల్లర వేషాలు వేస్తుంటాడు. అయితే ప్లేస్ మారిస్తే సెట్ అవుతాడని కేరళలో వుండే బావమరిది (నరేష్) V K Naresh అక్కడే ఓ కాలేజ్ లో జాయిన్ చేయిస్తాడు. అక్కడ కాలేజీలో చేరిన కుమార్‌కు మెర్సి (యుక్తి తరేజా)Yukthi Tareja పరిచయం అవుతుంది. ఆమెతో పరిచయం ప్రేమగా మారుతుంది. తీరా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన తర్వాత ఆమెకు అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందని తెలుస్తుంది. ఆ వ్యాధి కారణంగా సూసైడ్‌కు ప్రయత్నిస్తుంటుంది. దాంతో ఆమెతో లవ్‌కు బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అవుతాడు. కుమార్ ఏ విధంగా జల్సాలు చేశాడు? తన కుమారుడు దారి తప్పుతున్నాడనే బాధతో తండ్రి కృష్ణ ఏం చేశాడు? కేరళలోని కాలేజీలో చేరిన తర్వాత కుమార్ జీవితం ఎలా సాగింది? కేరళలో మెర్సీ తో పరిచయం, ప్రేమాయణం ఎలా సాగింది? అయితే మెర్సీకి ఉన్న అరుదైన వ్యాధి ఎలాంటి కష్టాలను కుమార్‌కు తెచ్చిపెట్టింది? మెర్సీకి ఉన్న వ్యాధి నయం అయిందా? బ్రేకప్ చెప్పాలనుకొన్న కుమార్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మెర్సీ ప్రవర్తన వల్ల కుమార్ ఎలాంటి నరకాన్ని అనుభవించాడు? చివరకు కుమార్, మెర్సీ ప్రేమ కథకు ముగింపు ఏమిటి? తండ్రి ఆవేదనను కుమార్ అర్దం చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కే ర్యాంప్ సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
Artists Performance : తన నటన గురించి గతంలో పలువురు చేసిన సూచనల్ని స్వీకరించానని కె ర్యాంప్ చిత్రంలో తన నటనలో మెరుగుదల కనిపిస్తుందని మాటిచ్చిన కిరణ్ అబ్బవరం.. సినిమాలో కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఆ మాటని అయితే నిలబెట్టుకున్నాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. యాక్టింగ్ పరంగా చాలా మెచ్యురిటీ కనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్‌లో తన తండ్రి గురించి రియలైజ్ అయ్యి కన్నీళ్లు పెట్టుకునే సీన్‌లో ఆ మెచ్యురిటీ కళ్లకి కట్టినట్టు కనిపిస్తుంది. కామెడీ, ఫన్, యాక్షన్ సీన్లలోనే కాకుండా. ఎమోషనల్ సీన్లలో పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. కారు ఎపిసోడ్‌లో కిరణ్ కంటతడి పెట్టించేలా నటించాడు. కిరణ్‌కు తోడుగా వీకే నరేష్ చెలరేగిపోయాడు. ఇక సాయికుమార్ మరోసారి బరువైన పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఇక యుక్తి తరేజా కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా బెస్ట్ ఇచ్చింది. కిరణ్ అబ్బవరంతో పోటీ పడి నటించింది. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపైనా గుర్తుండిపోయేలా నవ్వించాడు. అలాగే మురళీధర్ గౌడ్ కూడా కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా ఆకట్టుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు :
Technical Team Effort: సాంకేతికంగా సినిమా ఔట్ పుట్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. నూతన దర్శకుడు జైన్స్ నాని రాసుకొన్న కథ అల్లుకొన్న కథలో కొత్తదనం ఏమీ ఉండదు. కానీ మాస్, ఫన్ ఎలిమెంట్స్ కలిపి కేవలం కామెడీ ప్రధానంగా రాసుకొన్న సీన్లతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌పై దృష్టి పెట్టి ఫస్టాఫ్‌ను పూర్తిగా వినోదంతో నింపేశాడు. అది కూడా ఊర మాస్ కామెడీ సీన్లు కొన్ని వర్కువుట్ అయ్యాయి. మరికొన్ని తేలిపోయాయి. ఫస్టాఫ్ చూస్తున్నంత సేపు చాలా రొటీన్, రెగ్యులర్, నాసిరకం కామెడీతో లాగించేస్తారా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ కీలక మలుపు తిరుగుతుంది. దాంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేస్తుంది. ఈ సినిమాలో బీజీఎం హైలెట్‌గా నిలిచింది. ఫస్టాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవసరం లేకున్నా చాలా లౌడ్‌గా డిస్ట్రబింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలను హైలెట్ చేస్తూ.. ఎమోషనల్ సీన్లను చేతన్ భరద్వాజ్ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ చాలా వరకు అదిరిపోయాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్‌ను కట్ చేసి ఉంటే.. ఇంకా బెటర్‌మెంట్ ఎక్కువగా ఉండేది. అలాగే ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కేరళ అందాలను బాగా చిత్రీకరించారు. రాజేశ్ దండా అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.
విశ్లేషణ :
Analysis : కే ర్యాంప్ సినిమా విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. కిరణ్ అబ్బవరం నుంచి జనాలు అద్భుతాలను అయితే ఆశించరు. అతని స్టామినా ఏంటనేదానిపై జనాలకు ఓ అవగాహన ఉంది. అందుకే అబ్బవరం అబ్బా అనిపించకపోయినా పర్లేదు కానీ.. కాస్త ఎంటర్టైన్ చేస్తే చాలు అని సరిపెట్టేసుకుంటున్నారు. ఆ విషయాన్ని బాగా వంట పట్టించుకున్న అబ్బవరం.. మీకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేస్తా.. ‘కే ర్యాంప్’ ఆడిస్తా అని ప్రామిస్ చేశాడు. అన్న మాట ప్రకారం ‘కే ర్యాంప్’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని మాట నిలపెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ K- Ramp.