America: మిథున్‌రెడ్డి అమెరికా పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

మద్యం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) అమెరికా పర్యటనకు విజయవాడ ఏసీబీ కోర్టు (ACB court) అనుమతించింది. పార్లమెంటరీ బృందం అమెరికాలోని న్యూయర్క్ (New York) లో పర్యటించనుంది. ఈ బృందంలో మిథున్‌రెడ్డి కూడా ఉండడంతో, అనుమతి కోసం ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కరరావు తీర్పును వెలువరించారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒక్కొక్కటి రూ.50 వేలు విలువ చేసే రెండు పూచీకత్తులను సమర్పించాలని, అమెరికా లో పర్యటన, బస చేసే ప్రాంతాలు, ఫోన్ నంబరు, ఈ`మెయిల్ ఐడీ, ప్రయాణానికి సంబంధించి రాను, పోనూ టికెట్ల నకళ్లను అందజేయాలని, పర్యటన ముగిసిన వెంటనే కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని షరతులు విధించారు.