Australia: మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశంలోని అధునాతన వర్సిటీల్లో బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని రోడ్ షోలు (Road shows) నిర్వహించనున్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లో నవంబర్ 14, 15 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఇందులో దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, పాలసీ రూపకర్తలు, విద్యావేత్తలు పాల్గొననున్నారు.