Mining: వారికి వైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ : చంద్రబాబు

వడ్డెర్లు (Vadders) , వడ్డెర సొసైటీలకు మైనింగ్ (Mining) లీజుల్లో 15 శాతం మేర కేటాయించేలా విధివిధానాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. సచివాలయంలో గనులశాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వీరికి 15 శాతం లీజుల రిజర్వేషన్ కల్పించే అంశంపై వచ్చే క్యాబినెట్ (Cabinet) నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. వారికి కేటాయించే గనుల లీజుల్లో ప్రీమియం, సీనరేజ్‌ల్లోనూ 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. వెనుకబడినవర్గాలైన వడ్డెర్లకు లీజుల రిజర్వేషన్ ద్వారా ఆర్థికంగా మలు కలిగేలా ఉండాలని, వారు ఎంఎస్‌ఎంఈలుగా ఎదిగేందుకు కూడా చూడాలని ఆదేశించారు.