Samantha: పుష్ప సాంగ్ చేయడానికి కారణమదే!

వివిధ కారణాలతో సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇప్పుడు మరోసారి సమంత(samantha) వార్తల్లోకెక్కింది. నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ కారణంగా సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న సమంత, దాన్నుంచి కోలుకుని మళ్లీ కెరీర్లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. అందులో భాగంగానే సినిమాలను లైన్ లో పెడుతుంది సమంత.
రీసెంట్ గా ఎన్డీ టీవీ వరల్డ్ సమ్మిట్(NDTV world summit) లో పాల్గొన్న సమంత, కొన్ని ఆసక్తికర విషయాలపై మాట్లాడింది. తన లైఫ్ లో జరిగిన వాటికి తనక్కూడా సమాధానాలు తెలియవని, కానీ వాటి గురించే మాట్లాడాల్సి వస్తోందని చెప్పింది. తానేమీ పర్ఫెక్ట్ కాదని, తాను కూడా తప్పులు చేసి ఉండొచ్చని, జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నానని, కానీ ఇప్పుడు బెటర్ అయ్యానని సమంత చెప్పింది.
పుష్ప(pushpa) లో ఐటెం సాంగ్ చేయడం తన పర్సనల్ డెసిషన్ అని, తాను సెక్సీగా కనిపిస్తానని తనక్కూడా అనిపించదని, అందుకే తనకు ఎవరూ బోల్డ్ క్యారెక్టర్లు ఇవ్వలేదని, నటిగా తన బౌండరీస్ ఏంటో తెలుసుకోవాలని, దాన్నొక సెల్ఫ్ ఛాలెంజ్ గా తీసుకుని ఊ అంటావా(Oo Antava) సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది సమంత. తర్వాత ఆ సాంగ్ నేషనల్ లెవెల్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.