Pawan Kalyan: రాష్ట్రాభివృద్ధికి ఆయన అండగా: పవన్ కల్యాణ్

స్ఫూర్తిదాయక నేత మోదీ (Modi), ఆయనో కర్మయోగి. ఏ ఫలితం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా దేశసేవ చేస్తున్నారు. ఈ తరానికి దిశానిర్దేశం చేసే ప్రధాని స్థాయిలో ఆయన ఉండటం మన చేసుకున్న అదృష్టం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానే కాదు, రెండు తరాల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు పుట్టే బిడ్డలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దేశం తలెత్తి చూసేలా ఆత్మనిర్భర భారత్ అమలుచేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన అండగా ఉన్నారు. దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రజల నమ్మకాలను నిలబెడుతూ మోదీ, చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో సమష్టిగా ముందుకెళ్తాం అని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ (Lokesh) తనకిచ్చిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.