కనెక్ట్ ఏపీ సీఎం యాప్ను ఆవిష్కరించిన చంద్రబాబు
కనెక్ట్ ఏపీ సీఎం యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, సహాయం కోసం, సమస్యల పరిష్కారం కోసం కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనుభవ పూర్వక సలహాలు, సూచనలు ఇస్తే యాప్ ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. కైజాల యాప్లో మల్లిలేయర్ మెసేజింగ్ ఉంటుందని తెలిపారు. కాన్ఫిడెన్షియల్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటామని తెలిపారు. ఈ నెల 20న కాల్సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. యాప్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను విశ్లేషణ చేసుకుంటామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు నెగిటివ్ ధోరణి విడనాడాలని అన్నారు. ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. రాత్రికిరాత్రే సమస్యలు పరిష్కారం కావని ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
