దేవాన్ష్ పేరుతో అన్నప్రసాద వితరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేనాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలేశుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. దీనికోసం రూ.25 లక్షలను ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు విరాళంగా అందజేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం ఆయన కూడా భక్తులతో కలిసి సహంపక్తీ భోజనం చేశారు.
