Putin: యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నపుతిన్.. ట్రంప్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా..?
రష్యా-ఉక్రెయిన్(russia-ukraine) యుద్ధం ముగింపు దశకు చేరుకుందా..? యుద్దాన్ని ఆపేందుకు ఇరుదేశాలు సంసిద్ధంగా ఉన్నాయా.. ఇప్పటికే యుద్ధానికి ముగింపు పలికేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి కూడా. అయితే లేటెస్టుగా అమెరికా అధ్యక్షుడు(president trump) రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. సంగ్రామాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. అటు ఉక్రెయిన్.. ఇటు పుతిన్ తోనూ సంప్రదింపులు చేస్తున్నారు ట్రంప్.
ఫలితంగా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతామని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. గురువారం పుతిన్.. నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి(victory) చేరువలో ఉన్నామని.. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు. అయితే.. ఉక్రెయిన్ మాత్రం రష్యాకు మృత్యు పంజరంలా మారుతోంది. ఆ దేశం అనుసరిస్తున్న గొరిల్లా వ్యూహాల వల్ల ఇప్పటికే చాలా మంది సైనికులను రష్యా కోల్పోయింది. మరోవైపు.. ఉత్తరకొరియా సైనికులు కూడా ఇప్పటికే యుద్ధరంగంలో పాల్గొంటున్నారు.
మరోవైపు.. రష్యాలో సైతం యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈయుద్ధానికి వెళ్లిన చాలామందియువత మరణించడం.. వారికి ఆగ్రహం కలిగిస్తోంది. ఎందుకీ యుద్ధం.. ఇంకా ఎంతమంది చావాలని వారు ప్రశ్నిస్తున్నారు.






