Canada: కెనడా ప్రధానికి మిత్రపక్షం షాక్.. రాజీనామాకు జగ్జీత్ సింగ్ డిమాండ్..
సొంత పార్టీలో మద్దతు కోల్పోయి నానా తంటాలు పడుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudo) కు..మిత్రపక్షం నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ(NDP) గట్టి షాకిచ్చింది. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సమయంలో ట్రూడో సర్కారుపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తారా..? అని విలేకర్లు ప్రశ్నించగా.. అన్ని అవకాశాలను పరిశీలిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేసిన గంటల్లోనే .. జగ్జీత్ సింగ్(JAGMEET) డిమాండ్ చేయడంతో ట్రూడో సర్కార్ ఇరకాటంలో పడింది.
కెనడాలో తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నాయి. ఇళ్లు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడం, ట్రంప్ భారీ టారీఫ్‌లు విధిస్తామని హెచ్చరించడంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ‘‘ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ ఈ సమస్యలపై దృష్టిపెట్టడం మానేసి.. తమ సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. అందుకే ట్రూడోను రాజీనామాకు డిమాండ్ చేస్తున్నామన్నారు జగ్మీత్.. ఇటీవల విశ్వాసతీర్మానంపై ఓటింగ్‌లో ట్రూడో సర్కారు ఎన్డీపీ మద్దతుతో గట్టెక్కింది. మరోవైపు జగ్మీత్ సింగ్ ఖలిస్థానీ(KHALISTAN) వేర్పాటువాదానికి బలమైన మద్దతుదారు కావడంతో.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే ట్రూడో భారత్‌తో విభేదాలను పెంచి పెద్దవి చేసినట్లు ఆరోపణలున్నాయి.
మరోవైపు ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్‌లో(House of commence) విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కన్జర్వేటీవ్(conserv) పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే.. ఎన్నికలకు వెళ్లాలన్నారు. ‘‘ట్రూడో ప్రభుత్వంపై పట్టు కోల్పోయారు. అయినా అధికారాన్ని మాత్రం అంటిపెట్టుకొనే ఉన్నారు. మన అతిపెద్ద మిత్రుడు, వ్యాపార భాగస్వామి 25 శాతం టారీఫ్‌ల పెంపు తుపాకీ గురిని మనపై పెట్టిన వేళ ఈ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ సంయెల విభేదాలు, బలహీనతలను ఏమాత్రం అంగీకరించం. ట్రూడో అధికారంలో ఉన్నారంటే అందుకు జగ్మీత్ సింగే కారణం’’ అని ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే హౌస్ ఆఫ్ కామన్స్‌లో పేర్కొన్నారు.
ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపుపొందిన ఆమె.. ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో అందుకు క్రిస్టియా.. తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.






