Britain: బ్రిటన్ కు గ్రూమింగ్ గ్యాంగ్స్ టెన్షన్.. మస్క్ ఆరోపణలకు ప్రధాని కీర్ స్టార్మర్ రిప్లై…
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ‘‘గ్రూమింగ్ గ్యాంగ్’’ల విషయంలో బ్రిటన్ ప్రధాని కీర్స్టార్మర్పై (Keir Starmer) సంచలన ఆరోపణలు చేశారు. 2008-2013 సమయంలో పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తి ఓల్డ్ హోమ్‌లో లైంగిక వేధింపుల గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న ప్రస్తుత ప్రధాని కీర్స్టార్మర్ పట్టించుకోలేదని ఆరోపించారు. బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. ఈవిషయంపై లేబర్ పార్టీ విచారణను తిరస్కరించిన నేపథ్యంలో బ్రిటన్ కింగ్ ఛార్లెస్ పార్లమెంటును రద్దు చేసి.. ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని మస్క్ పిలుపునిచ్చారు.
దీనిపై యూకే (UK) ఆరోగ్యశాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ స్పందించారు. మస్క్‌కు అందిన సమాచారం తప్పు అని, ఆయన అంచనాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాము మస్క్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.ఎన్నో ఏళ్లుగా గ్రూమింగ్ గ్యాంగ్‌ల (Grooming gangs) వల్ల బ్రిటన్‌లోని చిన్నారులు, యువతులు ఎదుర్కొంటున్న లైంగిక దోపిడీపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఓల్డ్ హోమ్ కౌన్సిల్ చేసిన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించి, కౌన్సిల్‌ను దర్యాప్తు చేయమని ఆదేశించింది. కన్జర్వేటివ్‌లు కూడా ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తుండడంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది.
అసలు ఏమిటీ గ్యాంగ్‌లు..
Britain: బ్రిటన్‌లోని నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు చిల్డ్రన్ (NSPCC) ప్రకారం.. పిల్లలు, కౌమారదశలోని వారితో గుర్తుతెలియని వ్యక్తులు సంబంధాలు పెట్టుకోవడం, వారిని వాడుకోవడం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్ అంటారు. ముఖ్యంగా పిల్లలు, యవ్వనంలో ఉన్న వారితో లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి, వారిని అక్రమరవాణా చేయడానికి ఈ సంబంధాలు పెట్టుకొంటారు. ఇందుకోసం చాలామంది వ్యక్తులు కలిసి ఓ గ్యాంగ్‌లా పని చేస్తారు. బ్రిటన్‌లో ఇప్పటికీ ఇలాంటి గ్యాంగ్‌లు ఎక్కువగానే ఉన్నాయని పలు దర్యాప్తులు వెల్లడిస్తున్నాయి. వీటిల్లో పేరు మోసిన రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు ఎన్ఎస్పీసీసీ పేర్కొంటున్నాయి.






