వలసదారులపై ఆంక్షలు అమెరికా భవితకు నష్టమేనా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సమర్థిస్తూ వచ్చిన మెజార్టీ అమెరికన్లు.. నెమ్మదిగా ఆయన రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా ఇరాన్ పై యుద్ధం తర్వాత సగటు అమెరికన్ .. తమ బతుకుపై ఆందోళన చెందుతున్నాడు. దీనికి తోడు అమెరికా మేక్ గ్రేట్ ఎగైన్ అన్న నినాదం కూడా .. వాస్తవరూపం దాల్చడం లేదన్నది అమెరికన్ల భావనగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వలసదారులపై అతి నియంత్రణ .. దేశానికి తీరని నష్టం కలిగిస్తుందని వారు భావిస్తున్నారు.
ట్రంప్ వలస విధానాలపై చాలామంది అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. ఆయన చేపట్టిన వలస విధానాలు వ్యక్తిగతమేనని వారు భావిస్తున్నారు. ఒకప్పుడు వలసదారులకు గొప్పదేశంగా ఉన్న అగ్రరాజ్యం ఇకపై ఆ విధంగా ఉండబోదని భావిస్తున్నారు. అక్రమ వలసల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్లాయని వారు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఏపీ-ఎన్ఓఆర్సీ ఇటీవల నిర్వహించిన పోల్లో ఈ విషయం వెల్లడైంది.
ట్రంప్ చర్యల వల్ల తమకు తెలిసిన ఎందరో వలసదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు అమెరికన్లు పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా వారు భయపడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో అమెరికా తిరిగి వలసవాదులను ఆదరించినా.. ట్రంప్ విధానాల వల్ల దేశానికి కలిగిన నష్టాన్ని పూడ్చడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వలసలకు వ్యతిరేకంగా రూపొందించిన విధానాల్లో భాగంగా నైపుణ్యం గల విదేశీయులను తిరిగి వారి స్వదేశాలకు పంపుతున్నారని.. దీనివల్ల దేశాభివృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలోని వలసదారుల సంతానానికి దేశ పౌరసత్వం ఇవ్వకూడదనే ట్రంప్ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి






