ఘనంగా టీఫాస్ సంక్రాంతి వేడుకలు
న్యూజెర్సీ రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలో ఉన్న బ్రిడ్జివాటర్ నగరంలో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆలయ ఆడిటోరియంలో తెలుగు కళా సమితి (టిఫాస్) వారి ఆధ్వర్యంలో సంక్రాంతి-2019 సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు సుధాకర్ ఉప్పల, కార్యదర్శి మధు రాచకుళ్ల ఆధ్వర్యంలో యువజన కార్యదర్శి జ్యోతి గండి ఈ కార్యమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సుమారు 300 కుటుంబాలు హాజరయ్యాయి.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సుధాకర్ ఉప్పల మాట్లాడుతూ సంక్రాంతి అంటే యువజనోత్సవాలు అని అంటూ అందుకు అనుగుణంగా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు సంప్రదాయాలు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యం ప్రతిబింబించే విధంగా ప్రాంతీయ యువ కళాకారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బహుమతుల అందజేతకు నిధులు విరాళంగా ఇచ్చిన రాధ కాశీనాథునికి ఆయన కతజ్ఞతలు తెలిపారు తెలుగింటి ఆడపడుచుల సంప్రదాయ వస్త్రధారణ, రంగవల్లులు, పండగ ప్రాముఖ్యాన్ని తెలుపుతూ నిర్వహించిన కార్యక్రమాలు, పెద్దల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జ్యోతి గండి, సుప్రీత గోటేటి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కతిక కార్యదర్శి ప్రమీల గోపు ముగ్గుల పోటీలను నిర్వహించారు. తెలుగు పద్య పఠనం, తెలుగు మాట్లాడే పోటీలను కమ్యూనిటీ కార్యదర్శి ఉషా దరిసిపూడి ఏర్పాటు చేశారు. వీటికి వేణు ఏలూరి సహాయసహకారాలు అందించారు. రేణు తాడేపల్లి ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. దాము గేదెల ఆధ్వర్యంలో అచ్చతెలుగు షడ్రుచులతో కూడిన విందు భోజనాన్ని వడ్డించారు. సాంస్కతిక కార్యక్రమాలకు ప్రీతి ద్వారశీల, పవన్ గండి, అనూజ గేదెల, ప్రణవ్ మనికొండ, స్రవంతి మణికొండ, ధ్రుతి కామరాసు, బ ంద ఎర్రబెల్లి, త్రిష గ్రంథి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిన్నారులకు భోగి పళ్లు కార్యక్రమాన్ని జ్యోతి గండి నిర్వహించారు. సత్య వేమన వీడియో చిత్రీకరణలో సహకారం అందించారు.
తెలుగు కళా సమితి పూర్వ అధ్యక్షులు గండి శ్రీనివాస్, పూర్వ కార్యవర్గ సభ్యులు ఉమా మాకం, సురేశ్ మాకం, మధు అన్నా, సత్య వేమన, విజ్ఞాన్ కుమార్ వివిధ విభాగాల్లో సాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు కళా సమితి సభ్యులు సుధాకర్ రాయపూడి, చలికొండ రామకష్ణ, సత్య శ్రీకొండ, భారతి భావరాజు, ప్రముఖ వేద పండితులు రఘు శంకరమంచి కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. మన సంస్క తి భావితరాలకు చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అతిథులు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సాలు జేమ్స్, ఫొటోగ్రాఫర్ ఆనంద్, రుచికరమైన భోజనం అందించిన అతిథి రెస్టారెంటు యాజమాన్యానికి, మీడియాకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని వివిధ విభాగాల్లో సహకారం అందించిన జ్యోతి కామరాసు, జలజ గొల్ల, హర్ష గొల్ల, రవి నారవ, సుమన్ గేదెల, బసల లక్ష్మి కాటేపల్లి, సుభాష్ దరిసిపూడి, ప్రవీణ్ గూడూరు, స్వర? గేదెల, అలేఖ్య గేదెల, పవన్ గేదెల, లతా మడిశెట్టి, జయ రాయపూడి, అను కొల్ల, కష్ణ తమ్మన, మణి గ్రంథి, కష్ణవేణి శ్రీరామ్, శుభా వేములపల్లి, యువ వలంటీర్లు శ్రీయ చింతవార్, తన్వి నారవ, శాన్వి నారవ, కౌశిక్, త్రిష గ్రంథి, మాణిక్ మాసనం తదితరులకు కార్యదర్శి మధు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
