అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం సుముఖం
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్న్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కోడెల భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానాలు పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. అందుకు ప్రధాని మోడీ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. జనాభా పెరిగింది, ప్రజాప్రతినిధులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
