భారత విమానాలపై 21 వరకు నిషేధం

భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మరోసారి పొడిగించింది. వచ్చే నెల 21 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. భారత్‍తో పాటు మరో 13 దేశల విమానాల రాకపోకలకు ఈ షరతులు వర్తిస్తాయని పేర్కొంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఈ ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.