విమాన ప్రయాణికులకు శుభవార్త…

విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ శుభవార్త వెల్లడించింది. మెగా మాన్‍సూన్ సేల్‍ను స్పైస్ జెట్ ప్రారంభించింది. దీని కింద దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందించనుంది. విమానయాన సంస్థ ఉచిత విమాన వోచర్లను అందిస్తోంది. జూన్ 25 నుంచి ప్రయాణికులకు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీల మధ్య ప్రయాణానికి ఉచిత వోచర్ల బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ వన్ వే రిటైల్ చార్జీలపై ఉంటుంది. దేశీయ విమాన సర్వీసులపై రాయితీలు ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది. స్పైస్ జెట్ వెబ్ సైట్ లో ప్రత్యక్ష టికెట్ల బుకింగ్ లో కస్లమర్లకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.