ఎస్బీఐ గుడ్ న్యూస్ … హోంలోన్‌పై
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోంలోన్ కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోంలోన్‌పై వడ్డీ రేట్లును 6.7 శాతానికి తగ్గించింది. అంతేకాదు ఎంత లోన్ తీసుకున్నా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని తెలిపింది. ఇలా ఒకే రేటుకు హోంలోన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. దేశంలో పండుగల సీజన్‌కు ముందు ఇళ్లు కొనాలనుకుంటున్న వారిని ఆకర్షించడానికి ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎలా లబ్ధి చేకూర్చనుందో కూడా బ్యాంకు వివరించింది.
రూ.75 లక్షల హోంలోన్ తీసుకుంటే 7.15 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేంది. ఈ తాజా ఆఫర్‌తో ఏకంగా 45 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీనివల్ల రూ.75 లక్షల లోన్, 30 ఏళ్ల వ్యవధిపై రూ.8 లక్షల వరకూ వడ్డీ మిగులుతుంది అని ఎస్బీఐ తెలిపింది. ఇన్నాళ్లు హోంలోన్ వడ్డీ రేట్లపై ఆఫర్లు వచ్చినా అది సాధారణంగా కొంత మొత్తం లోన్ వరకూ లోన్ తీసుకునే వారి వృత్తికి అనుగుణంగా ఉండేవి. ఈ సారి మాత్రం అందరికీ ఆఫర్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నాం అని ఎస్బీఐ రీటెయిల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు.






