వ్యాక్సిన్ తీసుకున్న వారికి… ఇండిగో ఆఫర్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు టికెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. భారత్‍లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ ఛార్జీలలో ఇండిగో సంస్థ డిస్కౌంట్ కల్పించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ విమానయాన సంస్థ కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించలేదు. 18 ఏళ్ల పైబడి వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్‍ను వినియోగించుకున్న వారు తమ వెంట కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన టీకా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. ఎయిర్‍పోర్టు చెకిన్ సెంటర్, బోర్డింగ్ గేటు వద్ద ఈ ధ్రువీకరణ పత్రాలను చూపించాలని, లేదా ఆరోగ్య సేతు యాప్‍లో వ్యాక్సినేషన్ స్టేటస్‍ను కూడా చూపించొచ్చని ఇండిగో ప్రకటించింది.