చీరల వ్యాపారంలోకి రిలయన్స్ అధినేత!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చీరల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది. చీరలతో పాటు భారతీయ సంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం అవంత్రా బ్రాండ్ నేమ్‌తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ పండుగ సీజన్లోనే బెంగళూరులో తొలి స్టోర్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు చెందిన ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్‌కు పోటీగా ఈ వ్యాపారాన్ని ముకేష్ అంబానీ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తనిష్క్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ సంస్థలు కూడా త్వరలోనే సంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు నల్లీ సిల్కస్, పోతీస్ వంటి ఇతర బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. అంతేకాకుండా, ఆయా ప్రాంతాల్లోని నేత కార్మాకులతో ఒప్పందం కూడా చేసుకోనుంది.






