Rahul Gandhi: అది ఆయన పనికాదు ..అసలు ట్రంప్ ఎవరు? ..: రాహుల్ గాంధీ

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 25 సార్లు చెప్పారని దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏమని చెబుతుంది. ట్రంప్ కాల్పుల విరమణ చేయించారనా? కానీ అలా చెప్పలేరు. అయినా, అదే నిజం. ఇది కేవలం కాల్పుల విరమణ వరకే కాదు. మనం చర్చించాల్సిన చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కాల్పులు విరమణ చేయించినట్లు 25 సార్లు ట్రంప్ చెప్పారు. అసలు ట్రంప్ ఎవరు? అది ఆయన పనికాదు. ప్రధాని (Prime Minister) సమాధానం ఇవ్వడం లేదు. అది వాస్తవం అని పేర్కొన్నారు.