Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ బర్త్ డే .. శుభాకాంక్షల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs), ఇతర ప్రజాప్రతినిధులు ఆయనకు బర్త్‌డే విషెస్ (Birthday wishes) తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్, డీఎస్‌బీవీ స్వామి, నారాయణ, పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. విద్యా రంగంలో ఆయన విప్లవాత్మకమార్పులు తీసుకొచ్చారని కితాబిచ్చారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు, ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కషి చేస్తున్నారన్నారు.






