8 రకాల ఉపశమన చర్యలతో కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ

కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ఆర్థిక వ్యవస్థతో సహా, అన్ని రంగాలూ కుదేలయ్యాయి. కొన్ని రోజుల్లోగా థర్డ్ వేవ్ కూడా వచ్చేస్తోందని వార్తలొస్తున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వైద్య రంగంతో పాటు మరికొన్ని రంగాలకు ఊరటనిస్తూ మరో ఉద్దీపన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఉద్దీపనతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినందించింది. ముఖ్యంగా వైద్య రంగంపై కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మొత్తం 8 రకాల ఆర్థిక ఉపశమన చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో నాలుగు పూర్తిగా కొత్తవి కాగా, ఒకటి మాత్రం వైద్య రంగానికి చెందిన మౌలిక సదుపాయాలకు చెందినవి. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్య రంగానికి ఏకంగా 50,000 కోట్లను కేటాయిస్తున్నామని మంత్రి నిర్మలా ప్రకటించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య సౌకర్యాల కల్పనకు మరింత విస్తరించేందుకు పూనుకుంది. అలాగే వైద్య శాఖకు సహాయాన్ని అందించే సంస్థలకు తాము అండగా ఉంటామని కేంద్రం భరోసా కల్పించింది. అలాగే వైద్య, ఔషధ రంగాల్లో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాజెక్టులకు మరింత రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆమె ప్రకటించారు.
1. వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు సహకారం
2. కరోనా ప్రభావిత రాష్ట్రాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం
3. రుణానికి 3 ఏళ్ల పాటు గ్యారంటీ
4. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌తో 25 లక్షల మందికి లబ్ధి
5. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తనఖా లేకుండా రుణాలివ్వడం
6. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మే నుంచి నవంబర్ వరకూ 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తాం
7. చిన్నారులు, పిల్లల ఆరోగ్యం కసోం 23,220 కోట్ల ప్యాకేజీ
8. కొత్త క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద 2 శాతంతో రుణాలు
9. పర్యాటక రంగంపై ఆధారపడే వారికి 10 లక్షల వరకూ వ్యక్తిగత రుణం, టూరిస్ట్ గైడ్‌లకు 1 లక్షవరకూ రుణం
10. ఈశాన్య ప్రాంత రైతులకు తమ పంట ఉత్పత్తులపై 10-15 శాతం అదనపు పరిహారం
11. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలను అందించడానికి 19,041 కోట్ల రూపాయల అదనపు నిధులు