ఎన్నారై కోటా పచ్చిమోసం : సుప్రీంకోర్టు

కాలేజీ అడ్మిషన్లలో ఎన్నారై కోటా విధానం మోసం తప్ప మరొకటి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కోటా ద్వారా ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు సవరించిన నిబంధనలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పంజాబ్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20 నాటి నోటిఫికేషన్‌లో, ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థి నిర్వచనాన్ని విస్తృతం చేసింది. ప్రవాస భారతీయుల బంధువులు ఈ కోటా కింద ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులుగా ప్రకటించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇది దుర్వినియోగానికి తలుపులు తెరుస్తుందని అభిప్రాయపడిరది. ఎన్నారై కోట కింద బంధువులను చేర్చుకోవడం సరికాదని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇది డబ్బు సంపాదించుకునేందుకు ఒక ఎత్తుగడ లాంటిదని అభిప్రాయపడిరది. దీని ద్వారా విద్యా వ్యవస్థ బలహీనపడుతుందని పేర్కొంది.