Indian Air Force : భారత వైమానిక దళం కీలక నిర్ణయం… మిగ్-21 యుద్ధ విమానాలకు

భారత వైమానిక దళం (Indian Air Force) కీలక నిర్ణయం తీసుకున్నది. మిగ్-21 యుద్ధ విమానాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఫ్లీట్ నుంచి తొలగించనున్నది. మిగ్-21 జెట్‌లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ (Squadron) నిర్వహిస్తోంది. వారిని పాంథర్స్‌గా పిలుస్తంటారు. ప్రస్తుతం ఇవి రాజస్థాన్ (Rajasthan) లోని నల్ ఎయిర్‌బేస్‌లో ఉన్నాయి. ఈ మిగ్-21 విమానాల స్థానంలో ఎల్‌సీఏ మార్క్1ఏ విమానాలతో భర్తీ చేయనున్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికార వర్గాలు తెలిపాయి. మిగ్ 21 భారత్ తొలి సూపర్‌సోనిక్ (Supersonic) యుద్ధ విమానం. దీన్ని 1963లో భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు.ఈ విమానం 1960 నుంచి 70 సంవత్సరాల్లో సాంకేతికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద మిగ్ 21 అనేక మోడల్స్ ఉన్నాయి.