ఇండిగో బంపర్ ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ప్రారంభ ధరలో రూ.915(ఆల్ ఇన్‌క్లూజివ్) డొమెస్టిక్ విమాన ప్రయాణాలను ఇండిగో అందించుంది. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు కొనసాగనుంది. ఈ రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ పూర్తి వివరాలను కంపెనీ వైబ్సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్ విమానాశ్రయ ఫీజులు, ఛార్జీలు, ప్రభుత్వం విధించే పన్నులపై వర్తించదని పేర్కొంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో యాడ్ ఆన్ సేవలపై డిస్కౌంట్లు కాకుండా, ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, కా-చింగ్ కార్డ్‌లపై అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.






