సెప్టెంబర్ 30 వరకు ఐటీఆర్
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం అందించేందుకు గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్ లు (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని జూలై 31 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అలాగే సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఇప్పటికే పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ, ఆలస్య రుసుములను చెల్లించినట్లయితే వాటిని రీఫండ్ చెస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. జూలై 31 తర్వాతి నుంచి ఆలస్య రుసుములు, వడ్డీలు వసూలు చేస్తున్నారని కొంతమంది ట్యాక్స్ పేయర్ లు ఫిర్యాదులు చేశారని, ఈ నెల ఒకటో తేదీన సాఫ్ట్వేర్ లోపం సరిద్దామని ఐటీ శాఖ పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించాలని ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఇప్పటికే ఎవరైనా ట్యాక్స్ పేయర్ లు అదనపు వడ్డీ లేదా ఆలస్య రుసుములతో ఐటీఆర్‌లను సమర్పించినట్లయితే సీపీసీ -ఐటీఆర్ ప్రాసెస్‌లో సరిచేయబడుతుందని, ఏదైనా అదనపు చెల్లింపులుంటే వాటిని సాధారణ కోర్స్‌లో రీఫండ్ చేస్తామని ఐటీ శాఖ తెలిపింది.






