Achuthanandan: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ ఇకలేరు
కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (Achuthanandan) (101) కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటు (Heart attack) తో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస వీడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎం (CM) గా పనిచేసిన విషయం తెలిసిందే. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్.. లెలిన్(Lenin), స్టాలిన్ (Stalin) , మావోల జీవితాలతో పాటు, ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలకఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత.






