కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ .. లక్ష మందికి
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది దాదాపు 30 వేల ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. అలాగే 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్లకు 45 వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్ -19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ చైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు.
కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లో ఆన్‌బోర్డింగ్ కింద 45 వేల గ్రాడ్యుయేటర్లను ఆఫర్స్ ఇస్తామని, అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకోన్నుట్లు తెలిపారు.






