హైదరాబాద్ టూ చెన్నై ఎయిర్ ఇండియా ఫ్లైట్స్
ఈ నెల 29 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య ఉదయం సమయంలో విమాన సేవలను ప్రారంభించనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు హైదరాబాద్, చెన్నై విమాన సేవలు ఉంటాయి. అదే సమయంలో ఈ నెల 30 నుంచి హైదరాబాద్-బెంగళూరు విమానాలను కూడా నడపనున్నట్టు అలయెన్స్ ఎయిర్ వెల్లడించింది. 70 సీటర్ ఎటిఆర్ విమానం ఈ పట్టణాల్లో సేవలందించనుంది. ఉదయం సమయంలో ప్రయాణికుల ట్రాఫిక్ బాగా ఉండడం, డిమాండ్ దృష్ట్యా ఈ మార్గాల్లో సేవలను ప్రారంభిస్తున్నామని విమాన సంస్థ తెలిపింది.






