అవంతి ఉత్పత్తులకు… అమెరికా షాక్

రొయ్యలతో తయారు చేసిన కొన్ని ఆహార ఉత్పత్తుల్లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా మలినాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో అమెరికా నుంచి ఆ ఉత్పత్తులను అవంతీ ఫ్రోజెన్ ఫుడ్స్ (ఏఎఫ్‍ఎఫ్‍పీఎల్) స్వచ్ఛందంగా వెనక్కి రప్పించింది. వారం రోజుల క్రితం అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, యూఎస్‍ఎఫ్‍డీఏలు కంపెనీ సరఫరా చేసిన ఆహార ఉత్పత్తులో మలినాలున్నట్లు అవంతి ఫ్రోజెన్‍కు సమాచారం పంపాయి. దీంతో వెంటనే వాటిని ఉపసంహరించినట్టు కంపెనీ తెలిపింది.