Zelensky: ట్రంప్, మెక్రాన్‌తో జెలెన్స్కీ చర్చలు
తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌లతో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం జెలెన్స్కీ (Zelensky) మాట్లాడుతూ రష్యా` ఉక్రెయిన్ యుద్ధాన్ని న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మూడు దేశాల మధ్య సంబంధాలు, సహకారంపై చర్చించినట్లు వెల్లడిరచారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని త్వరగా ముగించాలని తాము కోరుకుంటున్నట్లు ట్రంప్, మెక్రాన్ (Trump, Macron) పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే రష్యా`ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.






