Putin: ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తాం : పుతిన్
సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీం యూరేషియన్ ఎనకామిక్ కౌన్సిల్(SEEC) సమావేశంలో పుతిన్ మాట్లాడారు. నేను దేవుణ్ణినమ్ముతాను. ఆయన మావైపే ఉన్నాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 2025లో మాస్కో(Moscow) తప్పక విజయం సాధిస్తుంది. ఇదే విషయాన్ని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి అని పుతిన్ పేర్కొన్నారు.






