Biden: ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలిస్తాం : బైడెన్
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా (Russia ) భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో దాడుల నుంచి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ (Ukraine )కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడిరచారు. దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖ(Department of Defense ) కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక ఉద్దేశం. గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నింది అని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో బైడెన్ అధ్యక్ష పీఠం నుచి వైదొలగనున్న సంగతి తెలిసిందే.






